Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!
119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..
ఇప్పటికే సర్వేల ఆధారంగానే టికెట్స్ ఇస్తారని ప్రచారం
పకడ్బందీ చర్యలతో రంగంలోకి కాంగ్రెస్
ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం
రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్న రాహుల్ , ప్రియాంక
సోనియా సైతం కొన్ని సభలకు హాజరయ్యే అవకాశం …

తెలంగాణ శాసనసభకు మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగ నున్నాయి…ఇందుకోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. అధికార బీఆర్ యస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ , తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ లమధ్య రసవత్తర పోరుకు రంగం సిద్దమవుతుంది. అన్ని హంగులు కలిగి ఉన్న అధికార బీఆర్ యస్ నేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక పై తలమునకలై ఉన్నారు …బీజేపీ ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది …కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా , గతంలో అమలు చేసిన పథకాలు , ఇందిరమ్మ ఇళ్ళు, ఇరిగేషన్ ప్రాజక్టులు ,ఉపాధి హామీ పథకాలు , పావలా వడ్డీ , రైతుల రుణమాఫీ యువతకు ఉద్యోగ ,ఉపాధి , లాంటి పథకాలను , వృద్దులు , వికలాంగులకు , వితంతువు పెన్షన్ లు ప్రధానంగా ప్రచారం చేయాలనీ కార్యాచరణకు సిద్ధమైంది. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ లో బహునాయకత్వం , సీనియర్ లు, జూనియర్ల మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి…. దీంతో కాంగ్రెస్ కు ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ …నాయకుల్లో అనైక్యత పెద్ద శాపంగా మారె అవకాశాలు కొట్టి పారేయలేనివే .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేయడంతో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక వేళ రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిపించిన పార్టీ మారరనే గ్యారంటీ ఏమిటనే అభిప్రాయాలను ఓటర్లు వెలిబుచ్చుతున్నారు . అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది ..కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కకుండా చేయాలనీ బీఆర్ యస్ కన్నా కూడా బీజేపీ అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగించే పనిలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో జోష్ పెరిగింది… దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని , వేటిలేటర్ పై ఉందని ప్రచారం జరుగుతున్న క్లిష్ట సమయంలో అంతకు ముందు హిమాచల్ రాష్ట్రం ,తాజాగా కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ కు ఆక్సిజెన్ ఇచ్చినంత పనిచేశాయి …కర్ణాటక ఎన్నికల తర్వాత పక్కనే ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని రాజకీయ పండితులు సైతం అంగీకరిస్తున్నారు . అయితే కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకొని ముందుకు పొతే బీఆర్ యస్ కు కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉంటుంది. ఇది పసిగట్టిన అధికార బీఆర్ యస్ , బీజేపీ లు కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ తగాదాలను సహజంగానే తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఎత్తులు వేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈసారి తెలంగాణలో అధికారం కోసం పకడ్బందీ వ్యూహాలు అమలుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యతలు అప్పగించింది…

కాంగ్రెస్ లు ఉన్న గ్రూప్ తగాదాలు , జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక , 119
నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలు అభ్యర్థులను వారు సునిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం . ఎవరైనా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం . అయితే కొంతమంది నేతలు అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు , రాసుకు పూసుకు తిరగటం ,కాపీ , చాయ్ ముచ్చట్లపై కాంగ్రెస్ అధిష్టానం అరా తీస్తుంది .అందుకే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశం అయ్యేందుకు అందిస్తాం ప్రత్యేక దూతగా వచ్చిన కేసి వేణుగోపాల్ తమ ఎదుటే వాదులాడుకుంటున్న నేతలపై అసహనం వ్యక్తం చేశారు . అంతే కాకుండా ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే మంత్రులు అవుతారు గానీ మేము వచ్చి కాముకదా అని ఒకింత కఠువుగానే మాట్లాడారు …

తెలంగాణలో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ దూరదృష్టితో అడుగులు వేస్తుంది . ఎప్పటికప్పుడు నాయకుల పనితీరు వారి మధ్య ఐక్యత సాధించాలనే లక్ష్యంగా పావులు కదుపుతుంది… ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మరో ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం . పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు బాధ్యతలను అప్పజెప్పింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడం, ప్రచారం, ఇతర ప్రధాన బాధ్యతలను వీరికి అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నిర్ణయాలను వీరు తీసుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం…. ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తారు …. రాహుల్ గాంధీకూడా రాజస్థాన్ , మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లతోపాటు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. సోనియా గాంధీ సైతం తెలంగాణాలో కొన్ని సభల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం …

.

Related posts

ఈటల విషయంలో బీజేపీ తొందరపడుతోంది.. బీజేపీ నేత పెద్దిరెడ్డి!

Drukpadam

మాజీ ఎమ్మెల్యేపై వేటు వేసిన జగన్!

Drukpadam

తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారు: బీవీ రాఘవులు

Ram Narayana

Leave a Comment