Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్ ప్రశ్న.. దీటుగా స్పందించిన స్మృతి ఇరానీ

  • ఇన్‌స్టా వేదికగా ఆస్క్ మి ఎనీథింగ్
  • మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని అడిగిన నెటిజన్
  • ఆమె నా కంటే పెద్దది.. రాజకీయాల్లో లేరు.. లాగవద్దని సూచించిన కేంద్రమంత్రి

సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ వేసిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్… మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని అడిగారు. దీనికి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ… ‘లేదు.. మోనా నా కంటే పదమూడేళ్లు పెద్దది. కాబట్టి ఆమె నా బాల్య స్నేహితురాలు అయ్యే అవకాశం లేదు.  ఆమె రాజకీయ నాయకురాలు కాదు. కాబట్టి ఆమెను రాజకీయాల్లోకి లాగవద్దు. ఏదైనా ఉంటే నాతో పోరాడండి. ఆమెను గౌరవించాలి’ అని చురకలు అంటించారు.

పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. తనకు వడాపావ్, పానీపూరీ రెండూ ఇష్టమేనని, అలాగే ఢిల్లీ, ముంబై.. రెండు నగరాలు ఇష్టమేనని చెప్పారు. నిజాయతీగా ఉండి రాజకీయాల్లో రాణించడానికి అదృష్టమే కారణమన్నారు. ఎవరైనా నిజాయతీగా ఉంటే అదే వారిని ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.

Related posts

భారత నగరాల్లో స్వల్పకాలిక వాయుకాలుష్యంతో ఏటా 33 వేల మంది బలి

Ram Narayana

అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలంటూ తమిళనాడులోని ఓ గ్రామంలో పూజలు…!

Ram Narayana

షిండేకు మొండిచెయ్యి.. బీజేపీకే ‘మహా’ సీఎం పోస్ట్

Ram Narayana

Leave a Comment