జాతీయ వార్తలు

భారీగా పెరిగిన సబ్బులు, కాఫీ, టీపొడి ధరలు!

  • 7 నుంచి 8 శాతం వరకు పెరిగిన సబ్బుల ధరలు
  • పామాయిల్ ధర పెరగడంతో సబ్బుల ధరలను పెంచిన కంపెనీలు
  • ఇటీవలే భారీగా పెరిగిన కాఫీ, టీపొడి ధరలు

ఊహించని విధంగా దేశంలో సబ్బులు, కాఫీ, టీపొడి ధరలు పెరిగిపోయాయి. స్నానపు సబ్బుల ధరలను హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్, విప్రో సహా అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచేశాయి. 7 నుంచి 8 శాతం వరకు ధరలు పెరిగాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడిపదార్థమైన పామాయిల్ ధర 35 నుంచి 40 శాతం వరకు పెరగడంతో సబ్బుల ధరలను కంపెనీలు పెంచేశాయి. 

ఇటీవలే కాఫీ, టీపొడి ధరలను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు 25 శాతం వరకు పెంచేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలను పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఎనిమిది శాతం వరకు ధరలను పెంచితే.. మరికొన్ని కంపెనీలు దశలవారీగా పెంచుతున్నాయి. ఒక్కసారిగా ధరలను పెంచితే డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందనే ఆలోచనతో… దశల వారీగా ధరలను పెంచాలని నిర్ణయించాయి. చర్మ సంరక్షణ క్రీమ్ ల ధరలను కూడా కంపెనీలు పెంచాయి.

Related posts

అమిత్ షా వ్యాఖ్యలకు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి కౌంటర్..1

Ram Narayana

అణచివేత ఉంటే జిహాద్ ఉంటుంది.. మౌలానా మదానీ సంచలన వ్యాఖ్యలు..

Ram Narayana

మంచి నిర్ణయం: ప్రధాని మోదీకి ‘థ్యాంక్స్’ చెప్పిన రాహుల్ గాంధీ!

Ram Narayana