Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన నాసా

  • మార్స్ పై ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసిన మోక్సీ అనే పరికరం
  • కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చిన వైనం
  • ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడి

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఘనతను సాధించింది. అంగారక గ్రహంపై నాసాకు చెందిన మోక్సీ అనే పరికరం ప్రాణవాయువు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియ విజయవంతంగా జరిగిందని నాసా వెల్లడించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చినట్టు తెలిపింది. భవిష్యత్తులో మార్స్ పైకి మానవులను పంపే మిషన్ లకు ఈ ప్రయోగం ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పింది. అంగారకుడిపై ఉన్న పర్సెవరెన్స్ రోవర్ లో ఓవెన్ పరిణామంలో ఉన్న ఒక యంత్రం ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా అంగారకుడిపై ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది. మోక్సీ ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసిందని తెలిపింది. ఈ ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా ఉందని… ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పింది.

Related posts

ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న హైద్రాబాద్ యువతి ఇషా సింగ్ ..

Ram Narayana

క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ పరిస్థితి విషమం…

Ram Narayana

స్కూటర్ బాంబు తో రష్యన్ జనరల్ ను చంపిన ఉక్రెయిన్…!

Ram Narayana

Leave a Comment