అంతర్జాతీయంక్రైమ్ వార్తలు

వేశ్యల పాలిట యముడు… 14 మంది దారుణ హత్య

  • ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం
  • కిగాలీ నగరంలో వేశ్యలను ఇంటికి పిలిపించుకుని హత్య
  • మృతదేహాలను కిచెన్ లో పాతిపెట్టిన వైనం
  • కొన్ని మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించిన నరరూప రాక్షసుడు
  • హతుల్లో మగ వేశ్యలు!

ఆఫ్రికా దేశం రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 

రువాండా రాజధాని కిగాలీలో ఈ నరరూప రాక్షసుడు ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు. 

ఆ సీరియల్ కిల్లర్ ను కిగాలీ పోలీసులు జులైలో దోపిడీ, అత్యాచారం, ఇతర ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పట్టువదలని పోలీసులు ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంటిలో మరోసారి తనిఖీలు చేపట్టగా, కిచెన్ లో పాతిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి. 

10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఆ కిరాతకుడ్ని అరెస్ట్ చేసి విచారించగా, మరో నలుగురు వేశ్యల మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్టు వెల్లడించాడు. కాగా, కుటుంబాలకు దూరంగా ఉండే వేశ్యలను, పెద్దగా స్నేహితులు లేని వేశ్యలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ సీరియల్ కిల్లర్ చేతిలో హతులైన వారిలో కొందరు మగ వేశ్యలు కూడా ఉన్నారట.

Related posts

కన్వర్ యాత్రపై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా సమాధానం!

Ram Narayana

అమెరికాలో అదానీ లంచంకేసు ప్రకంపనలు ….

Ram Narayana

ఇటలీ యువరాణి మరియా కరోలినాకు మోటార్‌సైకిల్ ప్రమాదం … ప్రాణాలతో బయట పడ్డానని తన ఇన్‌స్టాలో పోస్ట్

Ram Narayana