- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- సెప్టెంబరు 30 రాత్రి మోత మోగించాలన్న లోకేశ్
- రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు గంట, హారన్ మోగించాలని పిలుపు
- ప్లేటుపై గరిటెతో కొట్టండి, లేదా విజిల్ వేయండి అంటూ సూచన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘మోత మోగిద్దాం’ అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ నెల 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని పేర్కొన్నారు.
“ఇంట్లోనో, ఆఫీసులోనో, ఇంకెక్కడ ఉన్నా… బయటికొచ్చి గంట లేదా ప్లేటు మీద గరిటెతో కొట్టండి. లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి… మీరు ఏంచేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి” అని సూచించారు.
“అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయతీకి ప్రతిరూపం, తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం” అని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే!: నారా బ్రాహ్మణి
- పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్న బ్రాహ్మణి
- ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని హెచ్చరిక
- చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు… అక్రమ నిర్బంధన తప్పని చెప్పండని పిలుపు

అక్రమాలను ప్రశ్నించాలని లేదంటే అది ప్రమాదకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు టీడీపీ ఆధ్వర్యంలో మోత మోగిద్దాంకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.
‘పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి’ అని ట్వీటీ చేశారు.