జాతీయ వార్తలు

అత్యద్భుతమంటూ అయోధ్య దీపోత్సవ్ ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ

  • 22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్
  • మరపురాని వేడుకగా అభివర్ణించిన ప్రధాని మోదీ
  • 50 దేశాల రాయబారులు, అధికారుల హాజరు
  • గతేడాది కంటే 6.47 లక్షల దీపాలు అధికం
  • తన రికార్డును తనే బద్దలుగొట్టి గిన్నిస్ రికార్డుల్లోకి

దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22.23 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను  సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు.
 గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో అయోధ్య తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Related posts

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. ఢిల్లీ-వాషింగ్టన్ విమాన సర్వీసులు రద్దు…

Ram Narayana

శివసేన (యూబీటీ)లో ఉత్కంఠకు తెర.. తిరిగొచ్చిన ‘మిస్సింగ్’ కార్పొరేటర్…

Ram Narayana

ఉత్తరప్రదేశ్ వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు!

Ram Narayana