Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మంత్రి తుమ్మలకు శుభాకాంక్షల వెల్లువ …జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …

రాష్ట్ర వ్యవసాయ ,సహకార జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు ,ప్రజాప్రతినిధులు , వివాద వర్గాలవారు ,ఉద్యోగులు , పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు … తుమ్మల నివాసం శ్రీసిటీ వేలాది మంది ప్రజలతో కిటకిటలాడింది …వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ప్రజలు చేరుకున్నారు …అక్కడకు వచ్చిన ప్రజలకు తుమ్మల భోజన సదుపాయాలు కల్పించారు …

నూతన సంవత్సరం రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా, నియోజకవర్గ ప్రజలతో గడపాలని ఆలోచనతో శ్రీ సిటీ లోని నివాసంలో అందుబాటులో ఉండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి తుమ్మల అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నత అధికారుల తోపాటు దాదాపుగా పదివేల మంది తుమ్మల గారిని కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు.
ఉదయం 8:00 గంటల నుండి సందర్శకుల తాకిడితో శ్రీ సిటీ ప్రాంతమంతా జన సమూహంగా మారింది. దాదాపు 6:00 గంటలు వారి నివాసంలో ఏర్పాటుచేసిన వేదికపై నిలబడి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చిన అధికారులను, ప్రజా ప్రతినిధులను, పార్టీ నాయకులను,ప్రజలను, అందరిని పేరుపేరునా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినారు…దాంతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సంఘాల నాయకులు తెచ్చిన కేకులు కట్ చేశారు ….పలు శాఖల మరియు సంఘాల డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు.

సకల ఏర్పాట్లతోపాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి
వచ్చిన వారిని అందరిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు.

గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు మద్దతును ఇచ్చి తన గెలుపుకు కృషిచేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలను కృతజ్ఞతలు తెలుపుటకు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు మంత్రితుమ్మల… కార్యాలయంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు…. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ
పేదలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదం తో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు…తెలుగువారి కీర్తి నీ ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ దే
సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ రూపకల్పన చేయగా దేశ వ్యాప్తంగా మార్గదర్శి గా మారారు
నేను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తా
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం స్థలం రెగ్యులర్ చేస్తాం…అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులు నిబద్దత గా పనిచేశారు…ఎన్నికల్లో నా గౌరవం నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ కి రుణపడి ఉంటా…ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కి కృతజ్ఞతలన్నారు …తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు … ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, టిడిపి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ కూరపాటి వెంకటేశ్వర్లు,కేతినేని హరీష్,సీతయ్య, నల్లమల రంజిత్,

సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పావురాన్ని ఎగరవేసి ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు…

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరాన ఖమ్మం నగరంలో ప్రజలంతా గత పీడన నుండి బయటపడి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏటువంటి రాజకీయ వత్తిడులకు గురికాకుండా పౌరులంత
సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు….

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, మిక్కిలినేని మంజుల,జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి,మిక్కిలినేని నరేంద్ర తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..

ఖమ్మం పట్టణ అజిజ్ గల్లి లోని జమాతే ఇస్లాంమీ హింద్ వారు
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తుమ్మల విజయానికి కృషి చేసిన సంఘానికి అభినందించడానికి వారి కార్యాలయానికి తుమ్మల వెళ్లారు …ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నేను మొదటిసారి వచ్చి మిమ్మల్ని నా గెలుపు కొరకు అభ్యర్థించారు…ఈ సంస్థ యొక్క సుదీర్ఘ కాలప్రాయం మతం కోసం ప్రజల కోసం మైనార్టీ వర్గాల అట్టడుగు వర్గాల సంక్షేమం కొరకు చేస్తున్న సేవ చాలా అభినందనీయమన్నారు …

మీరు చేసే సేవలు అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
మీరు అడిగిన సమస్యలను నాకు వీలైనంతవరకు తీరుస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం హింద్ నాయకులు పాషా, మాలిక్, కాసిం, అబ్రహం సాధిక్ ఎఐసిసి నాయకులు చోటే బాబా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జావిద్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, ముక్తార్,రషీద్, హుస్సేన్,కూల్ హోమ్ ప్రసాద్, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన సీనియర్ నాయకులు ముంజర్లపాటి హనుమంత రెడ్డినీ పరామర్శించిన మంత్రి తుమ్మల …..ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, యండి,ఖాదర్ బాబా,జలగం రామకృష్ణ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

Related posts

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …

Ram Narayana

మమత మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నాడు…పువ్వాడ అజయ్ పై ..తుమ్మల ధ్వజం

Ram Narayana

బందిపోట్ల ముఠాను తయారు చేసింది నువ్వు …మంత్రి పువ్వాడపై తుమ్మల అటాక్…

Ram Narayana

Leave a Comment