Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఏఐజీ హాస్పటల్ లో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…!

ఇటీవల అస్వస్థతకు గురై హైద్రాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పరామర్శించారు …తమ్మినేని హాస్పటల్ లో చేరినప్పుడు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంట బెట్టుకుని ఏఐజీ కు వెళ్లి తమ్మినేని యోగక్షేమాలు తెలుసుకున్నారు …సకాలంలో సరైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చేసిన ఏఐజీ హాస్పటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టర్ల బృందానికి , సిబ్బందికి అభినందనలు తెలిపారు …కాసేపు తమ్మినేనితో ముచ్చటించారు ..సీఎంకు హాస్పటల్ వద్ద సిపిఎం రాష్ట్ర నాయకులు , పోతినేని సుదర్శన్ , ఎస్ .వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , తమ్మినేని కుమారుడు మిత్రా, తదితరులు ఆహ్వానం పలికారు …సీఎం ,పొంగులేటిలకు ఏఐజీ సి అండ్ ఎండి నాగేశ్వరరెడ్డి, తమ్మినేనికి వైద్యం అందించిన తీరును వివరించారు ..

గత 10 రోజుల క్రితం ఖమ్మం జిల్లా తెల్దార్ పల్లి గ్రామంలో తన నివాసంలో ఉండగా అస్వస్థతకు గురైన తమ్మినేనిని ముందు ఖమ్మంలోని ఆరోగ్య ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ తరలించారు ..వారంరోజులకు పైగా తమ్మినేనిని ఐసీయూ లో ఉంచి చికిత్స అందించిన డాక్టర్లు ఆయన సాధారణ స్థితికి వచ్చిన తర్వాత గురువారం సాయంత్రం స్పెషల్ రూమ్ కు తరలించారు ..డాక్టర్లు ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది చెప్పనప్పటికీ మరో మూడు నాలుగు రోజులు హాస్పటల్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం … గత పదిరోజులుగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై పలువురు వాకబు చేశారు …స్వయంగా హాస్పత్రికి వచ్చి పరామర్శించిన వారిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి ,మాజీమంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్సీ నర్సి రెడ్డి , సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు , ఏపీ సిపిఎం కార్యదర్శి వి .శ్రీనివాస్ రావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉన్నారు … సిపిఎం నాయకులు బి .వెంకట్ ,పోతినేని సుదర్శన్, బండి రమేష్ లతోపాటు కుటుంబసభ్యులు మొదటి నుంచి హాస్పటల్ వద్దనే ఉంటున్నారు …

Related posts

 ఫాంహౌస్ లో బొప్పాయి సాగు.. విత్తనాల కోసం కేసీఆర్ ఫోన్.. వీడియో ఇదిగో!

Ram Narayana

పార్టీ మార్పుపై నాలాంటి వాడిని పదే పదే ప్రశ్నించకండి: ఈటల

Drukpadam

రూ. 5 వేలతో పుష్పక్ జనరల్ బస్‌పాస్‌లు తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ!

Ram Narayana

Leave a Comment