- గతేడాది మార్చి 25న ఘటన
- అపార్ట్‌మెంట్‌లో దారుణంగా పొడిచి చంపిన నికోలస్
- శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి నదిలో పడేసిన నిందితుడు
- 8 రోజుల తర్వాత నదిలో లభ్యమైన బాధితురాలి శరీర భాగాలు
ఇంగ్లండ్‌లో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. భార్యను చంపి ఆమె మృతదేహాన్ని 224 ముక్కలు చేసి వాటిని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి నదిలో పడేశాడు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. రేపు (ఏప్రిల్ 8న) అతడికి శిక్ష ఖరారు కానుంది. గతేడాది మార్చి 25న 26 ఏళ్ల బాధితురాలు హోలీ బ్రామ్లీ శరీర భాగాలు లింక్లన్‌షైర్‌లోని బాసింగ్‌హాం వద్ద విథమ్ నదిలో గుర్తించారు. అప్పటికి ఆమె అదృశ్యమై ఎనిమిది రోజులు గడిచాయి.
నిందితుడు నికోలస్ మెట్సన్ (28)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత నేరాన్ని నిరాకరించిన నికోలస్ ఆ తర్వాత అంగీకరించాడు. నిందితుడు గతంలోనూ తమ మాజీ భార్యలపై దారుణాలకు తెగబడిన కేసుల్లో 2013, 2016, 2017లో దోషిగా తేలాడు. తాజా కేసు విషయానికి వస్తే బ్రామ్లీని 2021లో వివాహం చేసుకున్నాడు. వారిప్పుడు విడిపోయే దశలో ఉండగా లింకన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన మెట్సన్‌కు కోర్టు రేపు శిక్ష ఖరారుచేయనుంది.