ఆఫ్ బీట్ వార్తలు

రెండే చేపలు.. కానీ ధర రూ.4 లక్షలు…

  • అంతర్వేది తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచ్చిడీ చేపలు
  • శనివారం వేలంలో భారీ మొత్తం పలికిన వైనం
  • ఔషధ తయారీలో ఉపయోగిస్తారని చెబుతున్న మత్స్యకారులు

వలలో చిక్కినవి రెండే చేపలు.. అయితేనేం భారీ మొత్తాన్ని ఆర్జించిపెట్టాయి. ఒక్కోటీ ఏకంగా రూ.2 లక్షల ధర పలికాయి. దీంతో ఆ మత్స్యకారుల పంటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన  మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో శనివారం 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. అరుదైన ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడతారని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపలు అరుదైనవి కావడం, మందుల తయారీకి ఉపయోగపడడం వల్లే వీటికి ధర బాగా పలుకుతుందని పేర్కొన్నారు.

Related posts

ఒకప్పుడు రోడ్లపై బిచ్చమెత్తుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు డాక్టర్.. పింకీ హర్యాన్ స్ఫూర్తి గాథ!

Ram Narayana

మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ సంబంధాలు.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక!

Ram Narayana

డ్రై క్లీనర్ నెల సంపాదన రూ.2 లక్షలు.. నెట్టింట వైరల్ అయిన పోస్ట్!

Ram Narayana