Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కపిల్ సిబల్ ఘనవిజయం …

ప్రముఖ సీనియర్ న్యాయ వాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎస్‌సీబీఏ, అధ్యక్షుడిగా గురువారం ఎన్నికయ్యారు.

ఎస్‌సీబీఏ, అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వా న్ని ప్రకటించగా గురువారం ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌ని ఆయన ఓడించారు.

కపిల్ సిబల్‌కి 1066 ఓట్లు పడగా ప్రదీప్ రాయ్‌కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు ఎస్‌సీబీఏ అధ్యక్షు డిగా కొనసాగిన ఆదీశ్ అగర్వాల్‌కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు.

కపిల్ సిబల్ విజయంపై కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఉదారవాద, లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతి శీల శక్తులకు ఇది భారీ విజయమని ఆయన వ్యాఖ్యానించారు.

పదవి నుంచి దిగిపోబో తున్న ప్రధానమంత్రికి ఇది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో జాతీయ స్థాయిలో మార్పు జరగనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు..

Related posts

మరికొన్ని రోజులు జైల్లోనే కేజ్రీవాల్… బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్!

Ram Narayana

కేటీఆర్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు…

Ram Narayana

ఉత్పత్తుల నాణ్యత తెలుసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు

Ram Narayana

Leave a Comment