శానమండలికి మీ తరుపున గోల్డ్ మెడలిస్ట్ కావాలా…?బ్లాక్ మేలర్ కావాలా…మాజీమంత్రి
కేటీఆర్
బూతుపురాణం , ఆడపిల్లల గౌరవానికి భంగం కలిగే వ్యక్తి మండలికి వెళ్ళకూడదు
రైతు బిడ్డ ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డిని మండలికి పంపించాలి …
అమెరికాలో ఉన్నత విద్యను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు ..
శాసనమండలికి మీ తరుపున గోల్డ్ మెడలిస్ట్ కావాలా …? లేక నిత్యం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తి , బూతు పురాణాలు మాట్లాడేవారు , ఆడపిల్లలను అగౌరవంగా చేసే వ్యక్తి కావాలా మీరే ఆలోచించుకోవాలని మాజీమంత్రి బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు …ఖమ్మం , వరంగల్ , నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి బీఆర్ యస్ నుంచి పోటీచేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు , కొత్తగూడం , ఖమ్మంలలో జరిగిన సభల్లో కేటీఆర్ ప్రసంగించారు …ఇప్పటికే కాంగ్రెస్ చేసిన వాగ్దానాల నుంచి తప్పించుకోజూస్తుంది …అందువల్ల పాలకులను కాలర్ పట్టుకొని నిలదీసే సమర్థత ఉన్న వ్యక్తి రాకేష్ రెడ్డి ఆయన్ను గెలిపించడం ద్వారా పట్టభద్రుల చైతన్యాన్ని నిరూపించాలని అన్నారు ..సాయంత్రం ఖమ్మంలోని ఎస్బీఐటీ లో జరిగిన పట్టభద్రుల సభలో తనదైన శైలిలో కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థిపై వాగ్బాణాలు సంధించారు …
కేటీఆర్ మాటల్లోనే …
శాసనసభలో లోక్ సభలో ప్రజలు ఏకపక్ష ధోరణి ఇస్తే ప్రజాస్వామ్యాన్ని సమతుల్యంగా కొలిచేందుకు శాసనమండలి ఏర్పాటు చేశారని అన్నారు … పట్టభద్రుల తరఫున, తెలంగాణ నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ఏ విధంగా ఉండాలి మీరే నిర్ణయించుకోండని కేటీఆర్ అన్నారు …మీరు పట్టం కట్టే వ్యక్తి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు పురాణం మాట్లాడే వ్యక్తి ఉండాలా మీరే నిర్ణయించుకొండి…రాజేష్ రెడ్డి ఒక రైతు కుటుంబం నుండి వచ్చి అందరికీ తన వంతు సహకారం అందిస్తూ స్వతహాగా ఎదిగిన వ్యక్తి.రాకేష్ రెడ్డి అమెరికాలో ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీల్లో పని చేసిన వ్యక్తి…మనకోసం మనకు సేవ చేసేందుకు రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు…టిఆర్ఎస్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన రాకేష్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున బ్లాక్ మెయిలర్ బూతులు మాట్లాడే వ్యక్తి జైలుకు వెళ్లిన వ్యక్తి ఉన్నాడు…
ఆడపిల్లల గౌరవాలకు భంగం కలిగేలా చండాలం పని చేసిన వ్యక్తి పట్టభద్రులకు వెళ్లకూడదు.. ఆలోచించుకోండి…ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి అది రాకేష్ రెడ్డి తోనే సాధ్యం…కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తుంది. మాజీమంత్రి పువ్వాడ కష్టపడి ఐదేళ్లు పనిచేశాడు దురదృష్టవశాత్తు ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు…రాజేష్ రెడ్డి ని గెలిపించి శాసనమండలికి పంపించండి…ప్రభుత్వం ఇస్తా అన్న నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల గురించి రాకేష్ రెడ్డి పోరాడతారు…సమాజంలో మంచికంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది… సోషల్ మీడియాలో మంచి మాటలు చెప్పే రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు ఎవరు చూడరు, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి బూతులు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు…ఖమ్మం నగరం గత పదేళ్లలో సర్వాంగ సుందరంగా మారింది… 9 ఏళ్లలో మనం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు, దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ…నేను రాహుల్ గాంధీ, బిజెపి నాయకులను పప్రశ్నిస్తున్న.. మేము ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రమైనా ఇచ్చిందా, ఇస్తే చూపించండి అని…రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గరి నుండి ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా…రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి అని గల్లాపట్టి అడిగే వ్యక్తి రాకేష్ రెడ్డి…మనం వరంగల్ ఖమ్మం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చాం, వరంగల్ కు టెక్ మహీంద్రా వంటి కంపెనీలు వస్తే రేవంత్ రెడ్డి వచ్చాక అవి తిరిగి వెళ్ళిపోతున్నాయి…2014లో మనం వచ్చేనాటికి తెలంగాణలో ఐటి విలువ 55వేల కోట్లు, మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఐటీ విలువ 2 లక్షల కోట్లు…కెసిఆర్ పంపిన చక్కటి గ్రాడ్యుయేట్ రాకేష్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించండి… ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని మీ అభిప్రాయాన్ని, విలువైన ఓట్లు వినియోగించుకోండి… విద్యావంతులు ఓటు వేయకపోతే బ్లాక్ మెయిలర్లు, దొంగలు రాజ్యమేలుతారు… మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్లో మూడో నెంబర్ లో ఉన్న రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి…అని కేటీఆర్ పిలుపు నిచ్చారు ..
బీఆర్ యస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ …వరంగల్, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాలు పోరాటాలకు, మేధావులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు….పార్టీలు ఏవైనా పట్టభద్రులు అంతా మంచి వ్యక్తులను మండలికి పంపించారు…మండలి అంటే పెద్దల సభ, ఇక్కడ మేధావులను ఎన్నుకుంటారే తప్పా, మోసగాళ్లను ఎన్నుకోరు…కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చింది…రెండు పర్యాయాలు పాటు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు…
కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఇవ్వలేదు, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలేదు…బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రజల తరపున పొరాడతా, ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి మంచి చేస్తా…కాంగ్రెస్ అభ్యర్థి తనని తాను ప్రశ్నించే గొంతుకుగా చెప్పుకుంటారు, ఈ 5 నెలల్లో ఏ రోజైనా ప్రశ్నించాడా, విద్యావంతులు గమనించాలి…నేను రైతు కుటుంబం నుండి వచ్చాను, నా దేశం నా రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చా…బీజేపీ లో చాలా ఏళ్లు పని చేశా, ఎన్నో పోరాటాలు చేశా, కేసిఆర్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు…విధ్యవంతుడైన నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసిఆర్,, కేటిఆర్ గొప్పతనం…నన్ను ఆశీర్వదించకపోతే, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అనుకోరు…ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో మీరంతా ఆశీర్వదిస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు సేవ చేస్తా…నన్ను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తా… నాకు అవకాశం ఇస్తే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అని గల్లా ఎగరేసుకుని చెప్పుకునేలా చేస్తా…బ్యాలెట్ లో 3 వ అంకెల్లో ఉన్న కారు గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు
సభలో పాల్గొన్న నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్ కుమార్ లు మాట్లాడుతూ … పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు .. అందరి సమస్యలు తెలిసిన రాకేష్ రెడ్డిని దీవించి, మండలికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు.
పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే లు పల్లా రాజేశ్వర రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, మదన్ లాల్, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.