తెలుగు రాష్ట్రాలుప్రమాదాలు ...

రేపల్లె సికింద్రాబాద్ రైల్లో పెద్ద శబ్దాలతో ఎగిసిపడిన మంటలు ..రైలు నిలిపివేత

  • భయాందోళనకు గురై చైన్ లాగిన ప్రయాణికులు
  • గుంటూరు బైపాస్ దాటిన తర్వాత దాదాపు మూడు గంటలు నిలిచిన రైలు
  • దాదాపు తొమ్మిది గంటలకు తిరిగి బయలుదేరిన రైలు

సికింద్రాబాద్ – రేపల్లె రైలులో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు బయలుదేరింది. రైలు నుంచి ఒక్కసారిగా శబ్ధాలు రావడంతో పాటు నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారు. దీంతో రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది. 3 గంటలకు పైగా ఆలస్యంగా రేపల్లెకు చేరుకున్న రైలు తిరిగి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది …దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు ..

Related posts

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana

బీజేపీ వైపు చిరంజీవి చూపు ….

Ram Narayana

పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!

Ram Narayana