ఎలక్షన్ కమిషన్ వార్తలు

జూన్ 1 న చివర విడత 57 నియోజకవర్గాల్లో పోలింగ్ …ముగిసిన ప్రచారం …

ఏడో విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం… వారణాసిలో తుది విడతలో పోలింగ్

  • చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్
  • జూన్ 1వ తేదీన పోలింగ్
  • తుది విడతలోనే వారణాసి, మండి, గోరక్‌పూర్ నియోజకవర్గాలకు పోలింగ్

ఏడోదైన చివరి విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివరి విడతలో 8 రాష్ట్రాలలోని 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్ (4), ఝార్ఖండ్ (3), ఒడిశా (6), పంజాబ్ (13), ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (9) రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. చండీగఢ్‌లోనూ పోలింగ్ జరగనుంది. 

చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.

Related posts

 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు: కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే..!

Ram Narayana

ఏపీలో హింసపై ఈసీ సీరియస్… పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు… తిరుపతి ఎస్పీ బదిలీ…

Ram Narayana