Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, చిరంజీవి సహా ప్రముఖులు… వీరే

  • పలువురు కేంద్రమంత్రుల హాజరు
  • హాజరుకానున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
  • మాజీ గవర్నర్ తమిళిసై, మాజీ సీఎం పన్నీరు సెల్వం హాజరు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు.

వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Related posts

చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలే: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Ram Narayana

దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల… !

Ram Narayana

Leave a Comment