ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

తెలంగాణలో రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ.. వీరు మళ్లీ చేసుకోవాల్సిన పనిలేదు!

  • మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు
  • ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ
  • నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. ‘మీ సేవ’ అధికారులతో నిన్న పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. దీంతో మూడు రోజుల తర్జన భర్జనకు తెరపడింది.

పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 8వ తేదీ ఉదయం వెబ్‌సైట్ నుంచి మాయమైంది. దీంతో దరఖాస్తు దారుల్లో గందరగోళం నెలకొంది. 

ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి ‘మీ సేవ’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

అయితే, ఇప్పటికే ప్రజాపాలన, కులగణన, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, వాటి పరిశీలన ఇప్పటికే మొదలైందని అధికారులు తెలిపారు. 

Related posts

వైసీపీకి రాజీనామా చేసిన గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా…

Ram Narayana

మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుపై అంబటి రాంబాబు ఎద్దేవా!

Ram Narayana

పవన్ కల్యాణ్‌తో వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ

Ram Narayana