తెలంగాణ వార్తలు

మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం: రేవంత్ రెడ్డికి మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ!

  • ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించిన మంద కృష్ణ
  • జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయన్న ఎమ్మార్పీఎస్ అధినేత
  • చర్చించి, సూచనలు చేసేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. మిమ్మల్ని కలవడానికి సమయాన్ని కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మంద కృష్ణ స్వాగతించారు.

జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నివేదికపై చర్చించి సూచనలు చేసేందుకు తాము ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నట్లు మంద కృష్ణ వెల్లడించారు. వీలైనంత త్వరగా తమకు సమయం కేటాయించాలని కోరారు.

Related posts

అసెంబ్లీలో కీలక పరిణామం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ప్రారంభం!

Ram Narayana

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విడుద‌ల‌…

Ram Narayana

వణుకు తగ్గింది.. సెగ మొదలైంది: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన చలి…

Ram Narayana