Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాది చేతల ప్రభుత్వం… పొగులేటి

  • మాటిచ్చామంటే చేసి చూపుతాం
  • త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం
  • రాష్ర్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

కూసుమంచి/ఖమ్మం రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. ఏదైనా హామీ ఇచ్చామంటే కచ్చితంగా చేసి చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటించారు. కూ సుమంచిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలో ని కొండాపురం, తనగంపాడు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, ఆరేంపులలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గూడూరు పాడులో పల్లె దవాఖాన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఇక్కడి ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పది ఏళ్ల కాలంలో ఆ ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఆగస్టు నెలలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ గృహాలను కట్టించి ఇస్తామని, పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తున్నామని, మరో రెండు మూడు నెలల్లోనే వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని, గతంలో ప్రకటించని వాటిని కూడా అమలు చేసి చూపుతామని అన్నారు.
ఈ కార్యక్రమoలో..: కాంగ్రెస్ మండలాధ్యకులు కళ్లెం వెంకటరెడ్డి, మట్టే గురవయ్య, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, కొప్పుల అశోక్, నాయకులు తమ్మినేని నవీన్, బజ్జూరి వెంకట రెడ్డి, హఫీజుద్ధీన్, మద్ది మల్లారెడ్డి, కేతినేని వేణు, నాగండ్ల శ్రీనివాసరావు, దండ్యాల వెంకటేశ్వరరావు, కనకం వీరబాబు, భుజంగ రెడ్డి, భీష్మాచారి, అజ్మీర అశోక్ నాయక్, కేతినేని వేణు, దాసరి వీరభద్రం, సురేష్ నాయక్, రామిరెడ్డి, నాగేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వం..

Related posts

నెల్లూరు జిల్లా అతలాకుతలం.. డ్యామ్ లన్నీ ఫుల్.. ఉద్ధృతంగా చెరువులు, వాగులు

Drukpadam

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఎవరైనా చేయవచ్చా..?

Drukpadam

పోలవరం పోటుతో భద్రాచలానికి పొంచిఉన్న ముప్పు…

Drukpadam

Leave a Comment