Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది…బీజేపీ ఎంపీ ఈటెల

కేసీఆర్ కు విశ్వసనీయత లేదు.. ఏమైనా చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు

  • అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ గెలిచిందన్న ఈటల
  • రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని విమర్శ
  • రుణమాఫీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టడం దారుణమని వ్యాఖ్య

అడ్డదారులు తొక్కి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని… ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడని.. అందుకే ఆయనకు ప్రజలు బొంద పెట్టారని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పారు.

ఒట్టులు వేసి..దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. రుణమాఫీ నియమనిబంధనలు రైతులకు ఉరి తాళ్ళుగా మారతాయన్నారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తుచేశారు.
ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరన్నారు. మోసగాళ్ళను, మాట ఇచ్చిన తప్పినవారిని అంతిమంగా ప్రజలు బొంద పెడతారని హెచ్చరించారు.

అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ విరుచుకుపడ్డారు. మరోసారి మోసగించబడ్డామని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారన్నారు. ఐదేళ్ళు అధికారం ఇచ్చారని… ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారన్నారు. గతంలో విమర్శలు చేసినరేవంత్.. ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. ప్రజా సమస్యలపై లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదని.. పేదల ఇళ్ళు కూలగొట్టటమే పనిగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుందని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related posts

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి,

Ram Narayana

దోశ వేసి ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

Ram Narayana

10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు: స్పీకర్ ను కలిసిన అనంతరం కేటీఆర్

Ram Narayana

Leave a Comment