Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌…

  • తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని గుర్తుచేసిన కోర్టు
  • ఆమె జైలులో ఉండాల్సిన అవసరంలేదని వ్యాఖ్య
  • బెయిల్ పై గంటన్నర పాటు సాగిన వాదనలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు. కాగా, ఈ కేసులో కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.

కవితకు బెయిల్… హుషారుగా కేటీఆర్… వీడియో ఇదిగో

KTR happy after bail granted to Kavitha
  • కవితకు బెయిల్ రావడంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • ఆనందంతో పార్టీ నాయకులను ఆలింగనం చేసుకున్న కేటీఆర్
  • నెట్టింట వైరల్‌గా మారిన కేటీఆర్ సంతోషానికి సంబంధించిన వీడియో

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నాయి.

కేటీఆర్ సంబరాలు

తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.

కవితకు బెయిల్… కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ ఫోన్

KCR phone call to KTR and Harish Rao
  • ఫోన్ చేసి కూతురు బాగోగులు తెలుసుకున్న కేసీఆర్
  • కవిత రాక కోసం సిద్ధమవుతున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్
  • కవిత అరెస్ట్ అయ్యాక ఇప్పటి వరకు కూతురును కలవని కేసీఆర్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తన కూతురు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కూతురు బాగోగులు తెలుసుకున్నారు. 

కవిత అరెస్టైన మొదట్లో కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు. అమె అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కూతురును కలవలేదు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు. కూతురు అరెస్టైతే ఓ తండ్రిగా బాధ ఉండదా? అని వాపోయారు. 

తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన బీజేపీ తన కూతురును ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు.

Related posts

స్కిల్ కేసు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా…

Ram Narayana

నీట్ పేపర్ లీక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు…

Ram Narayana

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట… మధ్యంతర బెయిల్ మంజూరు

Ram Narayana

Leave a Comment