సీఎం సహాయనిధికి కూనంనేని 2 లక్షల 50 వేల విరాళం …
తన ఒకనెల వేతనాన్ని సీఎం ,డిప్యూటీ సీఎంల సమక్షంలో చెక్కు అందించిన కూనంనేని
కూనంనేనిని అభినందించిన సీఎం ,డిప్యూటీ సీఎం
ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలకు ఉప్పోగిన మున్నేరు వరదలకు వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో బయటకు వచ్చాయి..ప్రతి ఇంటిలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది ..ప్రభుత్వం సహాయం అందించిన అరకొరగానే ఉంది …పరిస్థితిని స్వయంగా తిరిగి చూసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనకు ఎమ్మెల్యే పదవి ద్వారా వస్తున్నా నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు జమచేయాలని నిర్ణయించుకున్నారు …అనుకున్నదే తడువుగా ఆయన నేరుగా సీఎంను కలిసి తన చెక్కును అందించడంపై అభినందనలు అందుకున్నారు … సహాయం అందించిన మొదటి శానసభ్యుడుగా ఆయన నిలిచారు …
వరద బాధితుల సహాయార్థం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.50 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు . ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు…