Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు.. రేవంత్‌పై ఈటెల ఫైర్

ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు.. రేవంత్‌పై ఈటెల ఫైర్

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నిరంతర దీక్ష చేస్తున్నారు. ఈ..సందర్భంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. ‘‘మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు’’ అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ‘‘మీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే మీ గౌరవం పోతుంది’’ అని మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితవుపలికారు.

ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెడతారన్నారు. రెండు మూడు రోజుల్లో రింగ్ రోడ్డు వద్ద ధర్నా చేస్తామన్నారు. సాక్షాత్తు హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేసిందని.. అవి వేసింది హైడ్రాపై కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు వ్యాఖ్యలతో అయినా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న. ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం’’ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Related posts

కాంగ్రెస్ సునామీ చూసి కేటీఆర్ సన్నాసికి ఏం చేయాలో అర్థం కావడం లేదు: రేవంత్ రెడ్డి

Ram Narayana

నెగ్గిన పట్నం పంతం …మంత్రిగా ప్రమాణస్వీకారం …

Ram Narayana

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ

Ram Narayana

Leave a Comment