Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా!

  • జమ్మూకశ్మీర్ లో ఘన విజయం దిశగా ఇండియా కూటమి
  • ఒమర్ అబ్దుల్లా తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా
  • ఇప్పటికే సీఎంగా పని చేసిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28 చోట్ల లీడ్ లో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల లీడ్ లో ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. 

ఈ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ కు కాబోయే ముఖ్యమంత్రి పేరును నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. తదుపరి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అని ఆయన చెప్పారు. ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. మరోవైపు, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకే జమ్మూకశ్మీర్ సీఎంగా పని చేశారు. ఇండియా కూటమి అధికారాన్ని చేపట్టబోతున్న నేపథ్యంలో… అబ్దుల్లా నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

Related posts

రెండో పెళ్లి ఆలోచన ఉంటే ఇప్పుడే చేసుకో..అజ్మల్ హిమంత బిశ్వ శర్మ కౌంటర్

Ram Narayana

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

Ram Narayana

సవాల్ విసిరి… మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజస్థాన్ బీజేపీ నేత

Ram Narayana

Leave a Comment