- బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడిగా శుభం లోంకార్
- సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో గత జూన్‌లో అరెస్ట్
- ఆధారాలు లేకపోవడంతో ప్రశ్నించి వదిలిపెట్టిన పోలీసులు
- 2018-19లో జైసల్వేర్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో శుభం లోంకార్ ఫెయిల్
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శుభం లోంకార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఈ ఏడాది జూన్‌లోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రశ్నించి వదిలిపెట్టారు.
ఎవరీ లోంకార్?
బాబా సిద్దిఖీ హత్యకేసులో అరెస్ట్ అయిన ప్రవీణ్ లోంకార్ సోదరుడే శుభం లోంకార్. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్న అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడిపై హిస్టరీ షీట్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాలేజీ డ్రాపౌట్ అయిన శుభం లోంకార్ 2018-19లో జైసల్మేర్‌లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరైనా అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత అతడు నేర ప్రపంచంలోకి వెళ్లి యాక్టివ్‌గా మారాడు. జనవరిలో అతని సోదరుడు ప్రవీణ్‌ను ఆయుధాల చట్టం కింద అకోలా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడికి బెయిలు లభించింది. సెప్టెంబర్ 24 నుంచి శుభం లోంకార్ కనిపించకుండా పోయాడు.