Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో మరో‌సారి బాంబు బెదిరింపుల కలకలం…

  • తిరుపతిలో మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు
  • రాజ్ పార్క్ హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరో వైపు గురువారం లీలామహాల్ సమీపంలోని మూడు హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారణ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Related posts

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అన‌ర్హ‌త‌పై లోక్ స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం ! 

Drukpadam

సెన్సార్ బోర్డు మెంబర్ గా ఖమ్మం కు చెందిన సన్నే ఉదయ్ ప్రతాప్…

Drukpadam

యాపిల్ ఐపాడ్ టచ్ ఇక కనిపించదు.. 20 ఏళ్ల అనంతరం నిలిపివేత!

Drukpadam

Leave a Comment