Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా..!!

‘సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా..!!

జోగులాంబ గద్వాల జిల్లలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ గా తనను ఎన్నుకుంటే ఏకంగా ఒకేసారి రూ.2 కోట్లు ఇస్తానని ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెప్పడం..
సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు వైరల్ అవుతుంది.

గ్రామానికి చెందిన పూల మద్దిలేటి అనే వ్యక్తి సర్పంచ్ గా తనను ఎన్నుకోవాలని ఎర్రవెల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు.

పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చేస్తానని, రెండు కోట్ల రూపాయలను పంచాయతీ పరిధిలోని ప్రజలకు పండగల సందర్భంగా ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు ఖర్చు అయి ఉంటదని, అందుకేనేమో ఏకంగా ఒకేసారి రెండు కోట్లు ఇస్తానని ఈ అభ్యర్థి చెప్పడం కరెక్టే అని ఎర్రవల్లి గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు.

Related posts

అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలు…

Ram Narayana

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ …పంటల బీమా పథకం అమలుకు కసరత్తు…

Ram Narayana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

Ram Narayana

Leave a Comment