Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

విమానంలో పాములు.. వణికిపోయిన ప్రయాణికులు!

  • బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళలు
  • వారి వద్ద విషపూరితమైన పాముల గుర్తింపు
  • శంషాబాద్ విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డ్డ పాములు

బ్యాంకాక్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికుల వ‌ద్ద విష‌పూరిత‌మైన పాములు బ‌య‌ట‌ప‌డ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల‌ తనిఖీల్లో ఇలా పాములు లభ్యమయ్యాయి.

త‌నిఖీల్లో పాములను కస్టమ్స్‌ అధికారులు గుర్తించిన‌ విషయం తెలిసి బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళ‌న‌కు గురయ్యారు. 

అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్‌ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువ‌చ్చార‌నే విష‌య‌మై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ప్ర‌యాణికుల వ‌ద్ద దొరికిన ఆ పాముల‌ను అనకొండలుగా అధికారులు గుర్తించారు. 

Related posts

ప్లేట్ పానీపూరీ రూ. 333.. అవాక్కయిన వ్యాపారవేత్త!

Ram Narayana

ల‌క్కున్నోడు.. బ్రిట‌న్ వ్య‌క్తికి రూ.1,800 కోట్ల జాక్‌పాట్‌!

Ram Narayana

సముద్రంలో పడిపోయిన ఏడాది తర్వాత దొరికిన యాపిల్ వాచ్.. ఇప్పటికీ పనిచేస్తున్న వైనం…

Ram Narayana

Leave a Comment