ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు!

  • ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ ప్రచారం చేశారని కేసు
  • బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోక్సో కేసు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదయింది. ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని… చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవించిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Related posts

ఛత్తీస్ గఢ్ లో దారుణం… చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య!

Ram Narayana

కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్.. ఆహ్వానం పలికిన కేటీఆర్

Ram Narayana

టీటీడీకి 1000 ఆవులిస్తా.. సొంతంగా నెయ్యి తయారుచేసుకోవచ్చు: బీసీవై పార్టీ అధక్షుడు బోడే

Ram Narayana