Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

దిలావర్‌పూర్ కంపెనీకి అనుమతులపై పూర్తి వివరాలు బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం!

  • కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతిచ్చిందని వెల్లడి
  • ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్‌కు కేబినెట్ అనుమతిచ్చిందని వెల్లడి
  • ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో అనుమతులు ఇచ్చినట్లు వెల్లడి

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఇక్కడ ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించింది. ఇక్కడ పర్యావరణ అనుమతులను కూడా గత ప్రభుత్వం ఉల్లంఘించినట్లు తెలిపింది. ఇక్కడ ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొంది.

గత ప్రభుత్వం కేంద్రం అనుమతులను పట్టించుకోలేదని తెలిపింది. ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు గత ప్రభుత్వ కేబినెట్ అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్‌కు కూడా నాటి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. మినహాయింపుల కోసం కంపెనీ అడ్డదారులు తొక్కిందని వెల్లడించింది.

గత ప్రభుత్వ మంత్రివర్గంలోనే పీఎంకే డిస్టిల్లేషన్స్ కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చారని తెలిపింది. కేంద్ర పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్‌వోసీ తీసుకోవాలని తెలిపింది. కానీ స్థానిక సంస్థల అనుమతులు లేకుండానే కాంపౌండ్ వాల్ కూడా నిర్మించినట్లు వెల్లడించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది.

2022 అక్టోబర్ 22న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని తెలిపింది. 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తులకు గత ప్రభుత్వం ఎన్‌వోసీ జారీ చేసినట్లు వెల్లడించింది. 2022 డిసెంబర్‌లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసిందని వెల్లడించింది. ఈ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు పొందిందని తెలిపింది. కంపెనీ స్వీయ ధృవీకరణ ఆధారంగా మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. 2023 ఫిబ్రవరి 24న కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్‌కు, 2023 జూన్ 15 నాటికే నీటి కేటాయింపులకు, 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది.

Related posts

కాంగ్రెస్‌కు షాక్.. ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమైన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

Ram Narayana

ట్రాఫిక్‌ చలానాలపై మరోసారి భారీ రాయితీ.. సన్నద్ధమవుతున్న తెలంగాణ పోలీసు శాఖ

Ram Narayana

డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

Ram Narayana

Leave a Comment