ఈనెల 5 న బుగ్గపాడు కు ఐదుగురు మంత్రులు ..
బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఈనెల 5న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్&కమ్యూనికేషన్, పరిశ్రమలు& వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రివర్యులు శ్రీధర్ బాబు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు పాల్గొని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్, మెగా ఫుడ్ పార్క్ ను సందర్శించి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో మంగళవారం చర్చించారు.
దాదాపు పదివేల మంది రైతులు ప్రజలు ఈ సభలో పాల్గొననున్నట్లు, వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, జర్మనీ హాంగర్ టెంట్, క్వాలీటి సౌండ్ సిస్టమ్, సరిపడ కుర్చీలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఫుడ్ పార్క్ సంబంధించిన అన్ని అంశాలు తెలియపరిచేలా స్టాల్స్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రోటోకాల్ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఉన్నతాధికారులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్, టీజీఐఐసీ సిఈ వినోద్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్మరత్ చంద్ర, జోనల్ మేనేజర్ మహేశ్వరరావు, కల్లూరు ఆర్డిఓ రాజేంద్ర గౌడ్, ఎమ్మార్వో యోగేశ్వరరావు, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంఈఓ రాజేశ్వరరావు, అధికారులు, తదితరులు ఉన్నారు.