- డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కాంగ్రెస్ సర్కారు
- విగ్రహం రూపంపై విమర్శలు
- తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అన్న కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి రూపం మార్పు అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. ఇవాళ ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్… తెలంగాణ తల్లి విగ్రహం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం… మూర్ఖత్వంతో ఇలా విగ్రహం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని విమర్శించారు.
అసెంబ్లీ, మండలి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ అంశాన్ని ప్రస్తావించాలని, తెలంగాణ తల్లి విగ్రహం నాడు ఉద్యమ సమయంలో రగిల్చిన స్ఫూర్తి గురించి వివరించాలని కేసీఆర్ సూచించారు.