తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం డీఏ 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ!

  • ఉద్యోగులకు డీఏను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
  • డియర్‌నెస్ అలవెన్స్‌ను 3.65 శాతం పెంచుతూ ఉత్తర్వులు
  • 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు బకాయిలు చెల్లించనున్న ప్రభుత్వం

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (డీఏ) 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Related posts

మా అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో .. చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి

Ram Narayana

మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ .. చట్టపరమైన చర్యలకు సిద్ధం

Ram Narayana

అమెరికాలో అదానీపై కేసు… స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత…

Ram Narayana