Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ బిల్లులపై సందిగ్ధత… రేపటి లిస్టు నుంచి తొలగింపు!

  • సోమవారం లోక్‌సభ బిజినెస్ అజెండాలో కనిపించని బిల్లులు
  • మోదీ సర్కారు ఊహించని నిర్ణయం 
  • ప్రస్తుత సమావేశాలకు మరో నాలుగు రోజులే సమయం

ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో సోమవారం (డిసెంబర్ 16) ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. లోక్‌సభ సోమవారం బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. ఈ మేరకు అప్‌డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది. 

కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. డిసెంబర్ 20తో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. సోమవారాన్ని మినహాయిస్తే మరో నాలుగు రోజులే మిగిలి ఉంటాయి. మరి ఈ సెషన్‌లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా… లేదా? అనేది తెలియాల్సి ఉంది.

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం లేదని సమాచారం. తాజాగా లోక్ సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించారు. తొలుత డిసెంబర్ 16న లోక్ సభ ముందకు బిల్లులు తీసుకరావడానికి కేంద్రం సిద్దమైంది.ఆ మేరకు దిగువసభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జు నామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని ప్రకటించింది. కానీ రివైజ్డ్ లోక్ సభ బిజినెస్ లో ఈ బిల్లులు కనిపించలేదు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరోవైపు డిసెంబర్ 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఇక, వివిధ శాఖల పద్దులకు పార్లమెంట్ ఆమోదం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా పరి ణామాలు నేపథ్యంలో.. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే, స్పీకర్ అనుమతితో సప్లమెంటరీ బిజినెస్ ఏ క్షణమైనా బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

మార్పులు.. సవరణలు
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82 ఏ ఆర్టికలు చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం.. అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు.. ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. అధికరణం 327ని సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది.

Related posts

 ప్రధాని మోదీ ఏమైనా దేవుడా? ఆయన వస్తే ఏమవుతుంది?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

మోడీ ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాసం …

Ram Narayana

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయిన రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment