ఆఫ్ బీట్ వార్తలు

అల్లు అర్జున్ ట్యాలెంటెడ్ యాక్టర్.. ఆయనతో నన్ను పోల్చొద్దు: అమితాబ్ బచ్చన్

  • ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో అమితాబ్ వ్యాఖ్యలు
  • అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడన్న అమితాబ్
  • ‘పుష్ప-2’ సినిమా ఘన విజయం సాధించిందని ప్రశంస

స్టార్ హీరో అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిభావంతుడు అని బిగ్ బీ కొనియాడారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో ఓ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్-16 ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్ కు కోల్ కతా నుంచి ఓ గృహిణి కంటెస్టెంట్ గా వచ్చారు. ఆమె మాట్లాడుతూ… తనకు అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ… తనకు వచ్చిన అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడని అన్నారు. ‘పుష్ప-2’ చిత్రం ఘన విజయం సాధించిందని… ఎవరైనా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడాలని చెప్పారు. అల్లు అర్జున్ చాలా ట్యాలెంటెడ్ యాక్టర్ అని… ఆయనతో తనను పోల్చవద్దని అన్నారు. 

ఈ క్రమంలో సదరు మహిళా కంటెస్టెంట్ మాట్లాడుతూ… కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ షో ద్వారా మిమ్మల్ని కలుసుకున్నానని… ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ను కూడా చూస్తే తన కల నెరవేరుతుందని అన్నారు.

Related posts

465 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు…ఇవన్నీ తినడం జరిగే పనేనా

Ram Narayana

ఇది గోల్డెన్ స్వీట్… కేజీ రూ.75 వేలు!

Ram Narayana

గుర్రం ధర రూ.15 కోట్లు.. గేదెకు రూ.23 కోట్లట!

Ram Narayana