ఆఫ్ బీట్ వార్తలు

రూ. లక్ష పలికిన చనిపోయిన పందెం కోడి!

సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓడిపోయినా దాని పోరాట పటిమను చూసిన పలువురు దానిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరికి ఓ వ్యక్తి దానిని లక్ష రూపాయలకు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఏలూరుకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం జరిగిన కోడిపందెంలో అది తుదికంటా పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్‌ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Related posts

కోడిగుడ్లు అమ్ముకునే వ్యక్తి రూ.50 కోట్ల బిజినెస్ చేశాడట.. ఐటీ శాఖ నోటీసులతో కలకలం!

Ram Narayana

ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళకు రూ.2.10 కోట్లు

Ram Narayana

అనంత్ అంబానీ చేతికి రూ.12.5 కోట్ల వాచ్… ‘వంతార’ స్ఫూర్తితో అద్భుత‌ రూపకల్పన…

Ram Narayana