కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారా …?
పార్టీ మార్పు వార్తలపై తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్న శశిథరూర్
ప్రధాని మోదీని, కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించిన శశిథరూర్
సొంత పార్టీలో కలకలం రేపిన వ్యాఖ్యలు
ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడలేనని స్పష్టీకరణ
కేరళ సీఎం పదవికి తాను అర్హుడినన్న సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసీసీ అధ్యక్షునిగా పోటీచేసి ఓటమిపాలైన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా …? అంటే అవుననే సమాధానమే వస్తుంది …ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో పార్టీ విధానానికి భిన్నంగా ప్రధాని మోడీపై ప్రసంశలు కురిపించారు …కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పు పెట్టె విధంగా మాట్లాడరు ..తిరిగి ప్రధానిని , కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ప్రశంశించారు ..దీంతో ఆయన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపడంతో ప్రతిసారి పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడలేనని కొత్త భాష్యం చెప్పారు ..అంతే కాకుండా తాను కేరళ సీఎం పదవికి అన్ని విధాలుగా అర్హుడనని ప్రకటించుకున్నారు …పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఆయన తనకు ప్రత్యాన్మాయ మార్గాలు ఉన్నాయని తెలపడం ఆయన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…
ప్రస్తుతానికి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ కనుక తన సేవలను వినియోగించుకోకూడదని భావిస్తే తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. శశిథరూర్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీంతో సొంత పార్టీలో ఇవి కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది.
శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసహనంతో ఉంది. శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కేరళ అభివృద్ధి గురించి అభిప్రాయాలు తెలియజేసే హక్కు తనకు ఉందని ఆయన అన్నారు. “పార్టీ నేను కావాలని కోరుకుంటే పార్టీ కోసం పని చేస్తాను, నేను వద్దు అని పార్టీ అనుకుంటే… చేసుకోవడానికి నాకు సొంత పనులు చాలా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
కాలం గడవడానికి తనకు ఎలాంటి వ్యాపకాలు లేవని అనుకోవద్దని వ్యాఖ్యానించారు. పుస్తకాలు, ప్రసంగాలు… ఇలా ఎన్నో ఉన్నాయని తెలిపారు. తన ప్రసంగం కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు.
ఈ ప్రచారంపై తాజాగా శశిథరూర్ స్పందించారు. దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే తాను అలా మాట్లాడానని, ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనకు చేతకాదని తేల్చి చెప్పారు. తానెప్పుడూ సంకుచితంగా ఉండనని పేర్కొన్నారు. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు. లేదంటే వరుసగా మూడోసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేరళ ముఖ్యమంత్రి పదవికి తాను అర్హుడినని శశిథరూర్ పేర్కొన్నారు. పలు ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు.