క్రైమ్ వార్తలు

గంజాయితో దొరికిపోయిన ఐఐటీ బాబా…

  • ఇటీవల కుంభమేళాతో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్
  • ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పుడు జోస్యంతో విమర్శలపాలు
  • ఇటీవల ఓ న్యూస్ డిబేట్ లో తనను కొట్టారని ఆరోపణలు
  • మరోసారి వార్తల్లోకెక్కిన ఐఐటీ బాబా

ఐఐటీ బాబా పేరిట ఎంతో ఫేమస్ అయిన అభయ్ సింగ్ తాజాగా గంజాయితో దొరికిపోయాడు.

కుంభమేళా సందర్భంగా ఎంతో పాప్యులారిటీ పొందిన ఈ ఐఐటీ బాబా… ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు సందర్భంగా… పాక్ పై కోహ్లీ పరుగులు చేయలేడని, ఈ మ్యాచ్ లో బారత్ ఓడిపోతుందని చెప్పాడు. కానీ ఆ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయడం, టీమిండియా గెలవడం అందరికీ తెలిసిందే. దాంతో ఐఐటీ బాబాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఆ తర్వాత టీవీ చానల్ డిబేట్ లో తనను కొట్టారని ఆరోపణలు చేశాడు. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకునే లోపు… లేటెస్ట్  గా గంజాయి వ్యవహారంలో చిక్కుకున్నాడు. 

గంజాయి కేసులో అతడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ లో ఓ హోటల్ లో ఉన్న ఐఐటీ బాబా నుంచి గంజాయి, ఇంకా పలు మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

దీనిపై ఐఐటీ బాబా స్పందిస్తూ… తన వద్ద లభించింది గంజాయి కాదని, ప్రసాదం అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రసాదం సేవించడం తప్పు అయితే, కుంభమేళాలో అనేకమంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని, వాళ్లందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. కాగా, జైపూర్ పోలీసులు అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నానమ్మ కళ్లలో ఆనందం కోసం హత్య..

Ram Narayana

మహా న్యూస్ కార్యాలయంపై దాడి .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

రూ.70 వేలకు కొనుక్కున్న మహిళతో వివాహం.. ఆమె తీరు నచ్చక హత్య

Ram Narayana