Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా అక్రెడిటేషన్ కార్డులు దక్కేలా తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజేే-ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. శనివారం హనుమకొండ బాల సముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. హనుమకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విరాహత్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ల విషయములో కొందరు చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని అన్నారు. అక్రెడిటేషన్ లను కొన్ని శక్తులు అంగట్లో సరుకుగా మార్చాయని, జర్నలిజం పరువు ప్రతిష్టను దిగజార్చుతున్న అలాంటి శక్తులకు ఈసారి తగిన బుద్ది చెబుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెలువడిన అక్రెడిటేషన్ జీవో అప్రజాస్వామికంగా ఉందని కొందరు హై కోర్టును ఆశ్రయించి దానిని రద్దు చేస్తూ ఆర్డర్ తెచ్చారని, దీంతో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ నాలుగైదు సార్లు సమావేశమై కొత్త నియమ నిబంధనలను రూపొందించిందని, ఈ నేపథ్యంలోనే అక్రెడిటేషన్ జారీలో జాప్యం జరుగుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పునరుద్దరించాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండుతో టీయూడబ్ల్యూజేే పోరాడుతున్న దని, ఇటీవలే ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రులను కలిసి విన్నవించడం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇప్పటికే ప్రెస్ అకాడమీ ద్వారా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయలతో పాటు జర్నలిస్టు భార్యకు ఐదేళ్ల పాటు నెలకు రూ. 3వేల పెన్షన్ అందించడం జరుగుతున్నదని, జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజేే కృషి చేస్తూనే, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడే సంఘం టీయూడబ్ల్యూజేే మాత్రమేనని,
ఏ ప్రభుత్వానికి భజన చేయలేదు కనుకనే డెబ్బై ఏండ్లు గా టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్రంలోఎదురులేని సంఘంగా జర్నలిస్టుల గుండెల్లో నిలిచిందన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ లపై ఇతరులు చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

పోరాటాల ద్వారానే సమస్యల పరిస్కారం …రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ

పోరాటాల ద్వారానా సమస్యలు పరిస్కారం అవుతాయని ,ఉద్యమాలు లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఏ సమస్య పరిస్కారం కాలేదని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ అన్నారు …జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు వచ్చాయన్న , అక్రిడేషన్స్ వచ్చాయన్న , ఇన్సూరెన్స్ స్కిమ్ వచ్చిందన్న ,మీడియా అకాడమీ ఏర్పాటు అయిందన్న , అది కేవలం టీయూడబ్ల్యూజే కృషి ఫలితమేనని అన్నారు ..దేశోద్ధారక భవనం లో జరిగిన నిర్ణయాల మేరకే మనం ఇప్పటివరకు అనేక విజయాలు జాడించుకున్నామని పేర్కన్నారు ..

నిర్మాణ పై ఆయన మాట్లాడుతూ తరచూ సమావేశాల ద్వారా సభ్యులమధ్య సమన్వయం పెంచుతూ టీయూడబ్ల్యూజేే ను పటిష్ఠం చేయాలని సూచించారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాలు కీలకమైనవని, నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ సంఘం ప్రతిష్టను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ లు అర్హులైన వారందరికీ అందేలా పోరాడాలన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు, వరంగల్ జిల్లా అద్యక్షులు ఎం.రాంచందర్, హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు తోట సుధాకర్, మట్టా దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు దాసరి క్రిష్ణా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, పి.వేణు మాధవ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అద్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, రెండు జిల్లాల ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

తీహార్ జైల్లో కవితకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు…

Ram Narayana

ఆడపిల్లను బతకనిద్దాం..చెరువుల్ని కాపాడుకుందాం

Ram Narayana

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు…

Ram Narayana

Leave a Comment