తెలంగాణ వార్తలు

భట్టి బడ్జెట్ బాగుంది …బాగాలేదు …స్పందన మిశ్రమం

తెలంగాణ శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025 -26 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి….

ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

Telangana Budget 2024 KTRs Strong Criticism and Accusations
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చిందని విమర్శ
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామన్న కేటీఆర్
  • ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా ఉందని చురక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చేస్తుందని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా పదేళ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పేదల కష్టాలను తీర్చే విధంగా లేదని ఆయన అన్నారు. ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సంబంధించి అంకెలు ఎందుకు మారాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్…

Telangana Budget Fails to Meet Promises BJP Leader
  • అబద్ధాలు, అప్పులు, దోపిడీల్లో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయిందని విమర్శ
  • హామీల్లో పది శాతం కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపాటు
  • బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న బండి సంజయ్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అబద్ధాల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతన లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు.

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదొక అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని బండి సంజయ్ పెదవి విరిచారు.

రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉంది: కూనంనేని సాంబశివరావు

రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి వాటా వెళ్లడమే తప్ప కేంద్రం నుంచి నిధులు రావడం లేదని విమర్శించారు. రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా హామీలను నెరవేర్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అన్నారు. ఖర్చు పెట్టకుండా ఆదాయం వచ్చే రంగాలను అన్వేషించాలని ఆయన అన్నారు. జనాభాలో సగం మందికి బడ్జెట్ ఫలాలు అందేలా లేవని అన్నారు.

  • ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూప‌క‌ల్ప‌న
  • అన్ని రంగాల శ్రేయస్సే పరమావధిగా బడ్జెట్ రూప కల్పన జరిగింది
  • రైతన్నలు ,మహిళలకు లబ్ధి చేకూరే విధంగా బడ్జెట్ రూప కల్పన
  • యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్ కేటాయింపులు
  • రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్ కేటాయింపులు హర్షంచ దగిన విషయం
  • రాష్ట్ర అభివృద్ధికి ఊతం కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పన
  • బడ్జెట్లో సాగునీటికి.. మున్సిపల్ పట్టణాభివృద్ధి కి అధిక ప్రాధాన్యత
  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయించడం..విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నిదర్శనం
  • దావొస్ లో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరింత ప్రోత్సాహానికి 3527 కోట్లు కేటాయించింది
  • గత బిఆర్ఎస్ ప్రభుత్వం వలే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండ కఠినమైన చర్యలు తీసుకుంది
  • ఎస్సీ సంక్షేమానికి 40,234 కోట్లు ,ఎస్టీ సంక్షేమానికి 17169 కోట్లు వెనకబడిన తరగతుల శాఖకు 11405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3591 కోట్లు కేటాయించి బడుగు బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది
  • ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నాం

-హామీల అమలు సందిగ్ధమే

ప్రజాపక్షం/ఖమ్మం : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు దాటినప్పటికీ బడ్జెట్ను పరిశీలిస్తే ప్రజల ఆశలు ప్రతిభింభించేలా లేవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రజల ఆశలను ఈ బడ్జెట్ నెరవేర్చదని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హామీల అమలుకు రూ. 56వేల కోట్లు కేటాయించినప్పటికీ హామీల అమలు నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. సాగునీటికి రూ. 23వేల కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. గత ఏడాది కంటే విద్యా రంగానికి బడ్జెట్ పెరిగిన ఆశించిన స్థాయిలో లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో గతేడాది కంటే తగ్గాయని హేమంతరావు తెలిపారు.

వ్యవసాయ శాఖకు గతేడాది కంటే బడ్జెట్ పెంచడం ఆహ్వానించదగిన పరిణామమే అయిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మరిన్ని కేటాయింపులు జరపాల్సి ఉందన్నారు. విద్య, వైద్య రంగాలను విస్మరించినట్లుగానే సంక్షేమ రంగం పట్ల కూడా బడ్జెట్లో వివక్ష ప్రదర్శించారని హేమంతరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బడ్జెట్ పరిశీలిస్తే అప్పులు తేస్తేనే రాష్ట్రం నడిచే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన దానిలో రైతుభరోసాకు, విద్య, వైద్య రంగాలకు కేటాయించిన దానిలో జీత భత్యాలకే సింహ భాగం ఖర్చు అవుతుందని హేమంతరావు తెలిపారు. ఎస్సి, ఎస్టీలకు కేటాయింపులు ఉన్న నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్సి, ఎస్టి కేటాయింపులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని నిధుల మళ్లింపు ప్రక్రియకు స్వస్తి పలకాలన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులను తూచ తప్పకుండా అమలు చేయాలని ఆయన సూచించారు. గొప్పలకు పోకుండా అంకెల గారడీ లేకుండా బడ్జెట్ను రూపొందించడం ప్రశంసనీయమని హేమంతరావు తెలిపారు. బడ్జెట్ తీపి, చేదుల మేళవింపులా ఉందని ఇప్పుడు అంకిత భావంతో వివిధ రంగాలకు కేటాయించిన వాటిని అమలు చేయాలని హేమంతరావు కోరారు.

తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పునాదులు వేసిందని ఇది ప్రజా రంజక బడ్జెట్ అని వర్గాలను కలుపుతూ అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ గా వర్ణించి ఆనందం వ్యక్తం చేసినారు.. ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క గారు రాజ్యాంగబద్ధంగా భావి భారత పౌరుల మనుగడను దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధి ధ్యేయంగా ప్రజారంచకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. గత దశాబ్ద కాలం పాలించిన ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఆర్థిక హింస కాండాన్ని సృష్టించినారు ఈనాడు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ప్రజల మండలాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతున్న ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, జిల్లా ప్రజల తరఫున వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము.. ఈనాడు ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 24,438 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, మరియు ఆరు గారెంటీ ల అమలకు పద్దులో అధిక మొత్తం కేటాయించినందుకు అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకొందని ఆనందం వ్యక్తం చేశారు.. విద్యా వైద్యం వ్యవసాయం సాగునీటి రంగాల అభ్యున్నతికి సంక్షేమ అభివృద్ధిని సహకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తూ పథకాల అమలు ద్వారా ప్రజలు మరింత మెరుగైన జీవనాన్ని ఆనందించాలని తపన ఈ బడ్జెట్ లో కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు.. తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో గణనయంగా దోహదపడుతున్న బడ్జెట్ అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమత్తోకం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు…

Related posts

క్యాన్సర్ రోగుల కష్టాలకు చెక్.. జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ…

Ram Narayana

అంబర్‌పేట పైవంతెనను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరి

Ram Narayana

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

Drukpadam