Pahalgam Terror Attack
జాతీయ వార్తలు

పహల్గామ్ ఉగ్రవాదులకు శ్రీలంకతో లింక్‌లు? రంగంలోకి దిగిన భారత్..

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన తాజా ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో పర్యాటకులు సహా పలు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో, భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. ఈ దాడికి సంబంధం ఉండొచ్చన్న అనుమానితులపై భారత నిఘా సంస్థలు కీలక సమాచారం పొందిన అనంతరం, చెన్నై నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్‌ లైన్స్ విమానాన్ని వారు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆదేశాల మేరకు అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండైన వెంటనే భద్రతా సిబ్బంది విమానాన్ని చుట్టు ముట్టి, ప్రయాణికుల్ని బోర్డు దించించ కుండా తనిఖీలు చేపట్టారు. విమాన నంబర్ 4R-ALS కలిగిన UL122 అనే విమానం మే 3వ తేదీ ఉదయం 11:59కి కొలంబోకు చేరుకుంది. విమానం రాకకు ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉండటమే కాక, ప్రయాణికుల లగేజీ, కస్టమ్స్, కేబిన్ ప్రాంతం, పైలట్ కాక్‌పిట్‌ తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారిక ప్రకటనలో, “విమాన రాక తర్వాత వందశాతం భద్రతా తనిఖీ నిర్వహించాం. ఇది పూర్తిగా నిఘా సమాచారం ఆధారంగా జరిగింది” అని శ్రీలంక ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

Related posts

అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు ఎన్నంటే..!

Ram Narayana

చట్టాన్ని తన పని తనని చేయనివ్వండి.. రెజ్లర్లతో అమిత్ షా…

Drukpadam

బెంగాల్‌లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు…మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Ram Narayana