Operation Sindoor
జాతీయ వార్తలు

ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది ?

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ దాడులు చేసింది. దీంట్లో తొమ్మిది కీలక ఉగ్ర కేంద్రాలు నేలమట్టం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఇంతకీ ఇంతటి సాహసోపేత ఆపరేషన్‌ను ఎవరు ప్లాన్ చేశారు? దాన్ని అంత కచ్చితంగా ఎలా అమలు చేశారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో చూద్దాం.

నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్ట్‌ బేస్‌లపై కచ్చితమైన సమాచారం సేకరించేందుకు దోవల్ ఒక స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది రోజువారీ ఇన్‌ఫర్మేషన్‌ను అనలైజ్‌ చేసి టెర్రరిస్ట్‌ బేస్‌లలో జరుగుతున్న మూవ్‌మెంట్స్‌ను గమనించింది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) ఈ ఆపరేషన్‌కు కీలక సమాచారాన్ని అందించింది. దోవల్ ఈ వివరాలను ప్రధానమంత్రి మోదీతో చర్చించి.. ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునేలా ప్లాన్‌ను రూపొందించారు. అనవసర నష్టాలను తగ్గించేలా ఈ వార్‌ స్ట్రాటజీని రూపొందించారు.

Related posts

జమ్మూ కశ్మీర్లో స్లీపర్ సెల్స్ దాడులు చేసే అవకాశం

Ram Narayana

రాజకీయ విరాళాల్లో బీజేపీకి రూ. 3,157 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 298 కోట్లు

Ram Narayana

కుంభ‌మేళాలో 60 కోట్ల మంది భ‌క్తుల పవిత్ర స్నానాలు… యోగి స‌ర్కార్ అధికారిక ప్ర‌క‌ట‌న‌!

Ram Narayana