జనరల్ వార్తలు ...

తవ్వకాల్లో బయట పడ్డ పురాతన బుద్ధుడి విగ్రహం

  • క్రీస్తుపూర్వం1, క్రీస్తు శకం3వ శతాబ్దాల మధ్య నాటిదని అంచనా

ఖమ్మం జిల్లాలో అరుదైన బుద్ధ విగ్రహం తవ్వకాల్లో బయట పడింది . చింతకాని మండలం నాగులవంచలో బయట పడిన అతి పురాతనమైన ఈ విగ్రహాన్ని పాలరాతితో చేసిన విగ్రహమని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు కోలేటి నాగేశ్వర రావు వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో శనివారం  ఉపాధి హామి కూలీలు మట్టి తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడింది. అక్కడే మరో 2 శిలలను కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు, పాత్రలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రెవిన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. విగ్రహాన్ని  రైతు పోలీసులకు అప్పగించాడు.  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు విగ్రహం బయట పడిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఆ పురాతన  పాలరాతి బుద్ధ విగ్రహం క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు. 

Related posts

Microsoft Office 365 now has 120 million business users

Ram Narayana

జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది.. విడుదల చేసిన ఎన్‌టీఏ

Ram Narayana

ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడి.. ఫుడ్ బ్యాంక్ ఫొటోతో దుమారం…

Ram Narayana