Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
CM Revanth Reddy
తెలంగాణ వార్తలు

నల్లమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక … సీఎం రేవంత్ రెడ్డి

  • రూ.12,600 కోట్లతో గిరిజన సంక్షేమ పనులు
  • నల్లమల రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ పంపుసెట్లు
  • పోడు భూములను సాగులోకి తెచ్చేందుకు చర్యలు
  • అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

నల్లమల ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై ‘నల్లమల డిక్లరేషన్’ను కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. ఒకప్పుడు వెనుకబాటుకు నిలయంగా ఉన్న నల్లమల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం గర్వకారణంగా ఉందని, తన గుండె ఉప్పొంగిపోతోందని ఆయన అన్నారు. తాను పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని సగర్వంగా చెప్పుకుంటానని, కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలన్నా ఒకప్పుడు పాలమూరు బిడ్డలనే పిలిచే వారని, వారు నిర్మించిన ప్రాజెక్టులే నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయని సీఎం గుర్తు చేశారు. నల్లమల ప్రాంత రైతులందరికీ ఉచితంగా సౌర విద్యుత్ పంపుసెట్లు అందిస్తామని, వంద రోజుల్లోగా సోలార్ విద్యుత్ మోటార్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామే వ్యక్తం చేశారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు, దిగ్గజ కంపెనీలతో పోటీ పడేలా స్టాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులైన సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వారి ఆనందంలో పాలుపంచుకున్నానని, నేడు ప్రతి పేదవాడి ఇంటికీ సన్నబియ్యం అందుతోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అందరికీ భూములు పంచి ఆత్మగౌరవం నింపాలన్నదే తమ పార్టీ సిద్ధాంతమని ఉద్ఘాటించారు.

Related posts

కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి అండగా ఉంటాం: శ్రీధర్ బాబు

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం …సర్వే ఆధారంగా టిక్కెట్లు ….రేవంత్ రెడ్డి

Drukpadam

అర‌గంట క‌రెంట్ నిలిపివేత‌.. కీస‌ర డీఈ సస్పెన్షన్!

Ram Narayana

Leave a Comment