జాతీయ రాజకీయ వార్తలు

పాకిస్థాన్ తో యుద్దంలో ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పండి: రాహుల్ గాంధీ

  • ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ కు సమాచారం అందించారన్న రాహుల్
  • దీని వల్ల మన వైమానికి దళం ఎన్ని విమానాలో కోల్పోయిందో చెప్పాలని డిమాండ్
  • రెండు రోజుల పోస్టుకు కొనసాగింపుగా తాజా ట్వీట్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ, పాకిస్థాన్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను నిలదీశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గట్టిగా ప్రశ్నించారు.

ఆపరేషన్ సిందూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో జైశంకర్ మౌనం వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదని, అది విపత్కర పరిణామం అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. “మరోసారి అడుగుతున్నాను, పాకిస్థాన్‌కు ముందే సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం?” అని జైశంకర్‌ను సూటిగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా ఈ తాజా ట్వీట్ చేశారు.

Related posts

మోదీని దించాలంటే.. ఆ తరహా ఉద్యమం రావాలి: అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు..

Ram Narayana

ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

పని ఒత్తిడిపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు… మండిపడిన కాంగ్రెస్

Ram Narayana