akistani military spokesperson
జాతీయ వార్తలు

నీటిని అడ్డుకుంటే.. భారత ప్రజల ఊపిరి తీస్తాం.. ఉగ్రవాది తరహా వ్యాఖ్యలు చేసిన పాక్‌ ఆర్మీ అధికారి

తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్‌పై పాక్‌ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద తరహాలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా పాక్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి (Pakistani military spokesperson) భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల నీటిని అడ్డుకుంటే భారత ప్రజల ఊపిరి తీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty) అమలును మన దేశం నిలిపివేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి (Ahmed Sharif Chaudhry) తాజాగా మాట్లాడారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు వచ్చే నీటిని భారత్‌ అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో (Indus River) జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలు.. లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయూద్‌ (Hafiz Saeed) వ్యాఖ్యలకు అద్దం పడుతోంది.

Related posts

ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు: కేంద్రం ఆదేశాలు

Ram Narayana

మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఆయుధాలు సరెండర్ చేసిన మల్లోజుల…

Ram Narayana

1984 అల్లర్లపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

Ram Narayana