తెలంగాణ వార్తలు

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూత…

  • గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

బానోత్ మదన్ లాల్ మొదటిసారిగా 2009 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు.

2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయనకు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్ ఉన్నారు. కుమారుడు ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

మదన్ లాల్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర .. ఈ సందర్భంగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి …నిరంతరం పార్టీ రాజకీయాలు అంటరు తిరిగిన మదన్ లాల్ మరణం పార్టీ శ్రేణులను ఆయన శ్రేయోభిలాషులు దిగ్బ్రాంతికి గురిచేసింది ..
హైద్రాబాద్ లోని ఏ ఐ జి ఆసుపత్రిలో మరణించిన మదన్ లాల్ భౌతిక కాయాన్ని మంగళవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని జిల్లా court edurugagala kaviraj నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు …పార్టీలకు atitamga మదన్ లాల్ కు మంత్రులు , వివిధ partyla నాయకులూ నివాళులు అర్పించారు …నిత్యం ఉషారుగా ఉండే మదన్ లాల్ మరణం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి… సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మాజీ సీఎం కేసీఆర్ , జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి , వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం…ఆర్ జేసీ కృష్ణ , కర్నాటి కృష్ణ , నాగరాజు ,…బీఆర్ యస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు , మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , కొండబాల కోటేశ్వరరావు , తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు

ఈర్లపుడి లో అంత్యక్రియలు …

మదన్ లాల్ అంత్యక్రియలు బుధవారం తన స్వగ్రామమైన ఈర్లపుడిలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ….ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది ..మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఏర్పాట్లను స్వయంగా చూస్తున్నారు …

Related posts

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే…మూడు ప్రాజెక్టులకు రాత్రిపూటే డిజైన్లు…

Ram Narayana

136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళా రెస్క్యూ బృందం

Ram Narayana

హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరిన సీఎం రేవంత్ రెడ్డి…

Ram Narayana