జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, పలువురు నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.వైద్యులు చెప్పారు …దీంతో కుటుంబసభ్యులు పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి…అయితే కొద్దీ సేపటి క్రితం ఆయన ఇకలేరు అన్న పిడుగులాంటి వార్త అందింది …ఇది ఆయన కుటుంబసభ్యులకే కాకుండా ఆయన అభిమానులు సైతం జీర్ణించుకొని సమస్యగా మారింది …
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023లో మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ మృతితో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు, పలువురు బిఆర్ఎస్ నేతలు హుటాహుటిన ఏఐజి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు..
Save or share this story as a newspaper-style Epaper Clip: