తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ యస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా …

ఒకపక్క కాళేశ్వరం అవినీతి అక్రమాలపై నివేదిక …మరో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం …కవిత వ్యవహారంతో సతమతం అవుతున్న బీఆర్ యస్ కు సుప్రీం కోర్ట్ సూచన ఆయుధంలా దొరికింది ..దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్ట్ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసేందుకు అసెంబ్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్లారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వారు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

Related posts

ఎన్నికల యుద్ధరంగంలోకి బీఆర్ యస్ …115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్…!

Ram Narayana

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి?

Ram Narayana

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి!

Ram Narayana