అతి త్వరలో తన అరెస్ట్ ఉండబోతుంది .. కేసీఆర్ సంచలన ప్రకటన!
తనను అరెస్ట్ చేస్తే ఎవరు భయపడవద్దు
అది కాళేశ్వరం కమిషన్ కాదు …కాంగ్రెస్ కమిషన్ అన్న కేసీఆర్
కాళేశ్వరం పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని విమర్శలు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘ చర్చ
త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది బీఆర్ యస్ నేతలను అరెస్ట్ చేయవచ్చని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటలకు పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చించారు . ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం రిపోర్ట్ పై కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని అన్నారు….
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు …సీఎం రేవంత్ రెడ్డి
సమావేశాలు ముగిసిన తర్వాత కమిషన్ సూచన మేరకు చర్యలు
సమావేశాలకు కేసీఆర్ ,హరీష్ రావు వచ్చి తమ వాదనలు వినిపించవచ్చు
త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ..సోమవారం కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి వర్గ సహచరులతో చర్చించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు .. ఆ సమావేశాలకు
వీలైతే కేసీఆర్, హరీష్ రావు కూడా ఆ సమావేశాలకే రావొచ్చునని అన్నారు …
సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటామని
సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ..